July 8, 2026

Mitchell Santner: బుమ్రా ఒక్కడే కాదు.. ఆ జట్టులో అందరూ ప్రమాదకరమే.. కానీ భారత్ పైనే ఒత్తిడి ఎక్కువ!

Mitchell Santner: బుమ్రా ఒక్కడే కాదు.. ఆ జట్టులో అందరూ ప్రమాదకరమే.. కానీ భారత్ పైనే ఒత్తిడి ఎక్కువ!
Reading Time: 2 minutes

Mitchell Santner: బుమ్రా ఒక్కడే కాదు.. ఆ జట్టులో అందరూ ప్రమాదకరమే.. కానీ భారత్ పైనే ఒత్తిడి ఎక్కువ!

Caption of Image.

Mitchell Santner: టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మార్చి 8న) జరగనుంది. టైటిల్ కోసం భారత్ -వర్సెస్ న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్ కి కాస్త అనుకూలంగా ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం హై స్కోరింగ్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అంచనా వేశాడు. అలాగే, టీమిండియా స్టార్ పేసర్ బస్ప్రీత్ బుమ్రాతోనే కాకుండా మిగతా ఇండియన్ ప్లేయర్స్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని వెల్లడించాడు. అయితే, ఇంగ్లాండ్ బ్యాటర్లు కూడా బుమ్రాను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ మ్యాచ్ లో అతడే గేమ్ ఛేంజర్ అని ప్రసంశించాడు. 

టీమిండియాతో ఫైనల్ పోరుకు ముందు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. బుమ్రా నుంచి మాకు తప్పకుండా సవాల్  ఎదురవుతుందని భావిస్తున్నాం.. కేవలం అతడితోనే కాదు.. ఆ టీమ్ లోని ప్రతి ఒక్క ప్లేయర్ తోనూ మేం జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నారు. బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వారు ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేయర్ ముందుకు వచ్చి జట్టును గెలిపించిన తీరు అద్భుతమని శాంటర్న్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకైతేనే నేను అహ్మదాబాద్ పిచ్ ని పరిశీలించలేదు.. ఇంకా కవర్ల కిందనే పిచ్ ని కప్పి ఉంచారు.

ALSO READ : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్

ఈసారి ఈ పిచ్ ఫ్లాట్ గా ఉండటంతో.. భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుందని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంటర్న్ అన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన భారత్, సొంతగడ్డపై గెలిచి, T20 ప్రపంచ కప్ టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా అవతరించాలనే ఒత్తిడితో ఉందని చెప్పుకొచ్చాడు. భారత్ జట్టుని వారి సొంతగడ్డపై ఒడించి కప్ గెలిచి, స్టేడియాన్ని సైలెంట్ చేస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వ్యాఖ్యలను శాంటర్న్ పునరావృతం చేశాడు. మొదటి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర తిరగ రాస్తామని శాంటర్న్ పేర్కొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.