Reading Time: 2 minutes
T20 World Cup 2026 Final Special Train Announced For Fans Travelling To Ahmedabad For Ind Vs Nz

T20 World Cup 2026 Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు ఆదివారం (మార్చి 8)న అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానుల కోసం నార్తర్న్ రైల్వే (NR) ప్రత్యేక రైలును ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఆలస్యంగా విడుదల కావడంతో చాలామంది క్రికెట్ అభిమానులు ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. మరోవైపు విమాన టికెట్ల ధరలు భారీగా పెరగడంతో అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో నార్తర్న్ రైల్వే ఢిల్లీ నుంచి సబర్మతి వరకు ప్రత్యేక రైలును నడిపేందుకు సిద్ధమైంది.

India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్‌కు ముందు సంచలన నిర్ణయం!

ఈ ప్రత్యేక రైలు నేడు (మార్చి 7)రాత్రి 11:45 గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఆ రైలు మార్చి 8 మధ్యాహ్నం 2:30 గంటలకు సబర్మతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, గురుగ్రమ్, జైపూర్ మార్గంగా ప్రయాణిస్తుంది. 04062 ట్రైన్ నంబర్ కలిగిన ఈ రైలులో మొత్తం 19 కోచ్‌లు ఉండగా.. వాటిలో థర్డ్ AC, సెకండ్ AC కోచ్‌లు కూడా ఉంటాయి.

భారత జట్టు శుక్రవారం నాడే అహ్మదాబాద్ కు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించనుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రాక్టీస్ చేయనుంది. న్యూజిలాండ్ జట్టు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది. భారత్ మీడియా సమావేశం మాత్రం ప్రాక్టీస్‌కు 15 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది.

Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!

ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌ను ఒక్కసారి కూడా ఓడించలేదు. దీనితోపాటు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు ఈసారి చరిత్రను తిరగరాస్తోందని నమ్మకం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా భారత్ వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా నిలవడం, సొంత గడ్డపై టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా నిలవడం లక్ష్యంగా బరిలోకి దిగనుంది.