July 8, 2026

Dera Baba: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా విడుదల

Dera Baba: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా విడుదల
Reading Time: < 1 minute
Dera Baba Acquitted In Journalist Murder Case

జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు భారీ ఊరట లభించింది. ఏడు సంవత్సరాల జైలు జీవితం తర్వాత పంజాబ్-హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. డేరా బాబా న్యాయవాది జితేందర్ ఖురానా శనివారం మీడియాకు తెలిపాడు. జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిందని తెలిపాడు.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర

సిర్సాలోని డేరా బాబా ప్రధాన కార్యాలయంలో మహిళా అనుచరులపై లైంగిక దాడి జరిగినట్లుగా వార్తాపత్రిక ‘‘పూరా సచ్’’లో ఒక అనామక లేఖను ప్రచురించింది. అనంతరం 2002లో జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతిని ఇంటి వెలుపల తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో పెను సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: Israel-Iran: ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు.. వీడియో వైరల్

అనంతరం 2019లో జర్మలిస్ట్ హత్య కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దోషిగా తేల్చి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. డేరా బాబాతో సహా మరో ముగ్గురిని దోషులుగా తేల్చింది. తాజాగా దాదాపు ఏడేళ్ల జీవిత ఖైదు తర్వాత హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. ఇక ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసినందుకు 2017లో విధించబడిన 20 ఏళ్ల జైలు శిక్షను కూడా డేరా బాబా అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత హర్యానాలోని రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో ఉంచారు.