Reading Time: 2 minutes
Ind Vs Nz T20 World Cup 2026 Final Reasons Why India Could Become Champions

IND vs NZ: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మార్చి 8న భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌పై ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌ ను ఐదుసార్లు ఎదుర్కొన్నప్పటికీ భారత్ ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల గణాంకాలు, సెంటిమెంట్లు భారత్ ను విజేతగా నిలుస్తుందని చెబుతున్నాయి. మరో ఆ విశేషాలు, సెంటిమెంట్స్ ఏంటో చూసేద్దామా..

* జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓటమి:
వైట్ బాల్ క్రికెట్ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ ఉంది. వరల్డ్ కప్ టోర్నీలో ఎప్పుడైతే జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిందో.. ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి కారణం 1983 వన్డే వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆసీస్‌ను ఓడించింది. ఆ సమయంలో భారత్ విజేతగా నిలిచింది. అలాగే 2007 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇదే జరిగింది. అప్పుడుకూడా భారత్ ఛాంపియన్ గా నిలిచింది. మళ్లీ ఇప్పుడూ టోర్నీలో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడంతో అభిమానులు ఇదే సెంటిమెంట్ మళ్లీ కచ్చితంగా రిపీట్ అవుతుందని భావిస్తున్నారు.

India vs New Zealand: ఫైనల్‌కు ముందు షాకింగ్ లెక్కలు.. టాస్ గెలిచిన టీమ్‌కే కప్పు?

* హోమ్ గ్రౌండ్ సెంటిమెంట్:
2011 వన్డే వరల్డ్ కప్‌లో సొంత గడ్డపై కప్పు గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ దేశం కూడా సొంత గడ్డపై టైటిల్ గెలవలేదు. ఈసారి ఫైనల్ భారత్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. భారత్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్‌లో సొంత గడ్డపై ట్రోఫీ సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

* సౌతాఫ్రికా చేతిలో ఓటమి:
భారత్ వరల్డ్ కప్ గెలిచిన సందర్భాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపించింది. గ్రూప్ స్టేజిలలో భారత్ ను ఓడగొట్టిన ఏకైక జట్టు సౌతాఫ్రికా కావడం విశేషం. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ కేవలం సౌతాఫ్రికాతో మాత్రమే ఓడిపోయింది, అప్పుడూ టైటిల్ గెలిచింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇప్పటివరకు భారత్ ఓడిపోయింది అదికూడా సౌతాఫ్రికాతోనే. ఈ ట్రెండ్‌ను బట్టి చూస్తే భారత్‌కు మరోసారి కప్పు దక్కే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అనుకుంటున్నారు.

India vs New Zealand: సెమీస్‌లో గెలిచిన ‘వ్యూహం’ ఫైనల్‌లోనూ రిపీట్.. గంభీర్ ప్లానింగ్ వర్కౌట్ అయితే ట్రోఫీ మనదే!

* భారత్ – ఇంగ్లాండ్ సెమీఫైనల్ ట్రెండ్:
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ – భారత్ మధ్య సెమీఫైనల్ జరిగినప్పుడు ఒక ప్రత్యేక ట్రెండ్ కనిపించింది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టే చివరికి ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి కారణం 2022లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించింది. అప్పుడు ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. అదే 2024లో భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. అప్పుడు భారత్ రెండోసారి ఛాంపియన్ గా అవతరించింది. ఇప్పుడు మరోసారి సెమీఫైనల్‌ లో కూడా భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించడంతో అదే ట్రెండ్ కొనసాగుతుందని అభిమానులు నమ్ముతున్నారు. చూడాలి మరి చివరకు ఏ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి భారత్ మూడోసారి విజేతగా నిలుస్తుందో..