Reading Time: < 1 minute

ఎండా కాలంలో వాన కబురు.. మరో రెండ్రోజుల్లో రెండు రోజులు వర్షాలు

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణలో ఫిబ్రవరి 22 నుంచి 24 వరకూ మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణలో తీవ్రమైన పెను గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఫిబ్రవరి 23 నుంచి 24 వరకు.. హైదరాబాద్‌తో సహా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వాన కురిసే అవకాశం ఉంది.

ఈసారి ఎండాకాలం మండిపోనుందని, ఎండలతో పాటు వర్షాలూ అప్పుడప్పుడు పలకరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు చెప్తున్నారు. ఈ సమ్మర్లో జనం మిక్స్​డ్ వెదర్తో ఇబ్బందిపడక తప్పని పరిస్థితులు రానున్నాయని అంటున్నారు. ఓవైపు వానలు.. మరోవైపు ఎండలతో ఈ వేసవి కాలం భిన్నంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్లే వేసవి ఇలా ఎండావానల కలబోతగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పడిప్పుడే చలి కాలం నిష్క్రమిస్తుండగా.. ఫిబ్రవరి రెండో వారం నాటికి ఎండాకాలం మెల్లగా మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఏప్రిల్​ చివరి వరకు ఎండతో పాటు మోస్తరు వానలు కూడా పడే అవకాశాలున్నాయని అంటున్నారు.

కొన్నిసార్లు క్లౌడ్​బరస్ట్​లకూ చాన్సెస్ ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే, అసలు ఎండాకాలం మే నెలలోనే మొదలవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. 2023 ఏడాదికి మించి ఈ ఎండాకాలంలో ఎండలు కొట్టే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. మేతో పాటు జూన్ మొదటి వారంలోనూ ఎండలు మండిపోయే చాన్స్ ఉందని అంటున్నారు.

©️ VIL Media Pvt Ltd.