Reading Time: < 1 minute

రంజాన్ నెల ప్రారంభం..ఫిబ్రవరి 19నుంచి ఉపవాస దీక్షలు

Caption of Image.

ముస్లింల పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. రంజాన్ మాసం ప్రారంభానికి  సూచికగా భారత్ లో నెలవంక కనపించింది. గురువారం(ఫిబ్రవరి19) తెల్లవారుజామున ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాసం దీక్షలు ప్రారంభిస్తారు. ప్రత్యేక నమాజు తరావీ ప్రార్థనలు బుధవారం (ఫిబ్రవరి 18) రాత్రి నుంచే ప్రారంభమయ్యాయి.

ఈ మాసంలో ప్రతి రోజూ తెల్లవారు జామునుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక చింతన,  దానధర్మాలు చేస్తారు. రంజాన్ ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. పవిత్ర మాసానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా చాలా మసీదులు అందంగా ముస్తాబు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.