
U19WorldCup ఫైనల్ మ్యాచ్ వన్ సైడ్గా సాగుతోంది. టీమిండియా కుర్రాళ్లు కప్పు ముద్దాడటం దాదాపుగా ఖాయమైంది. టీమిండియా నిర్దేశించిన 412 పరుగుల భారీ టార్గెట్ ఛేజ్ చేయడంలో ఇంగ్లండ్ ఘోరంగా విఫలమైంది. 22 ఓవర్లకే ఇంగ్లండ్ ఏడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 177 పరుగులు మాత్రమే చేసింది. ఇంకా 230 పరుగులకు పైగా పరుగులు చేస్తే గానీ ఇంగ్లండ్ గెలిచే పరిస్థితి లేదు.
కానీ.. ఇంగ్లండ్ జట్టుకు ఆ పరిస్థితి దాదాపుగా లేనట్టే. ఏదైనా ఊహించని అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లండ్ ఫైనల్లో గెలవడం జరగని పని. బెన్ డాకిన్స్ 66 పరుగులు, బెన్ మేయెస్ 45 పరుగులు, థామస్ రెవ్ 31 పరుగులు చేశారు. ఓపెనర్ జోసెఫ్ మూర్స్ నాలుగు ఫోర్లతో చెలరేగినప్పటికీ ఆ జోష్ కొనసాగలేదు.
►ALSO READ | అనుకున్నదే జరిగింది.. ఇంగ్లండ్ ఓపెనర్ మళ్లీ ఫెయిల్.. అంబ్రీష్ బౌలింగ్లో బౌల్డ్
టీమిండియా బౌలర్ అంబ్రీష్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు. 19–1, 93–2, 142–3, 174–4, 174–5, 177–6, 177–7 ఇలా.. ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయిన పరిస్థితి. అత్యధిక పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించనుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. టీమిండియా బ్యాటర్లే కాదు బౌలర్లు కూడా సమష్టిగా రాణించారు. ఇంగ్లండ్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్ బౌలర్లు అప్పుడప్పుడూ ఫోర్లు, సిక్సులతో బ్యాట్ ఝుళిపించినా ఆ జోరుకు టీమిండియా బౌలర్లు బ్రేకులు వేసి పెవిలియన్కు పంపారు.
Deepesh Devendran pulls off a stunner and England’s chase begins to crumble with wickets falling in quick succession 👀🔥
ICC Men’s #U19WorldCup | FINAL | #INDvENG | LIVE NOW 👉 https://t.co/fqoIISRm33 pic.twitter.com/TWGEGdzGs9
— Star Sports (@StarSportsIndia) February 6, 2026