Reading Time: < 1 minute

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్: 15 ఆర్థిక సంఘం నిధులు విడుదల

Caption of Image.

హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా రూ.259 కోట్లు విడుదల చేస్తూ గురువారం (ఫిబ్రవరి 5) కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025, డిసెంబర్‎లో తెలంగాణలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సుమారు రూ.3 వేల కోట్లకు పైగా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.   

 

©️ VIL Media Pvt Ltd.