Reading Time: < 1 minute

మేడారం హుండీల లెక్కింపు.. 300 మంది సిబ్బంది, భారీ భద్రత..

Caption of Image.

హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ భద్రత మధ్య మేడారం హుండీల లెక్కింపు జరుగుతోంది. గురువారం ( ఫిబ్రవరి 5 ) జ్యోతి ప్రజ్వలన చేసి కౌంటింగ్ ప్రారంభించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. 200 మంది అధికారులు, 300 మంది వాలంటీర్లతో భారీ భద్రత మధ్య కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ సహా ఆదివాసి పూజారులు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

గత ఏడాది జాతర కంటే ఈ ఏడాది 288 అదనపు హుండీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. మేడారం జాతరలో 828 హుండీలలో భక్తులు వేసిన కానుకలను లెక్కిస్తున్నారు అధికారులు. బెల్లం..కొబ్బరి నీళ్లతో కరెన్సీ తడిచిపోయిన క్రమంలో వాటిని లెక్కించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.కౌంటింగ్ ఏరియాలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటింగ్ జరగనుంది.

©️ VIL Media Pvt Ltd.