Reading Time: < 1 minute

బడ్జెట్తో ఉత్పాదకతకు ఊతం.. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ రిపోర్ట్

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు:  ఈసారి కేంద్ర బడ్జెట్ ఆర్థిక క్రమశిక్షణతో కూడిన వృద్ధికి పునాది వేసిందని, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం దేశ ఉత్పాదకతను పెంచుతుందని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ రిపోర్ట్​ పేర్కొంది.

 దీని ప్రకారం.. ద్రవ్య లోటును జీడీపీలో 4.3 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యం స్థిరత్వాన్ని సూచిస్తోంది. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల ఎగుమతులు పెరిగి 2027 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధికి అదనపు బలం చేకూరుతుంది. జీఎస్టీ 2.0 వల్ల ఆదాయం కొంత తగ్గినా, ప్రత్యక్ష పన్నుల వృద్ధి ఆశాజనకంగా ఉంది. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించడం వల్ల చిన్న పరిశ్రమలకు మేలు జరుగుతుంది. తయారీ, సేవా రంగాల్లో ఉపాధి కల్పనపై బడ్జెట్ దృష్టి సారించిందని కేర్​ ఎడ్జ్​ పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.