Reading Time: 2 minutes

T20 World Cup 2026: వరల్డ్ కప్ ముందు పసికూన డేంజర్ బెల్స్.. పెద్ద జట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే

Caption of Image.

ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు ఇటలీ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తొలిసారి వరల్డ్ కప్ కు అర్హత సాధించిన ఇటలీ జట్టు ఆసక్తికరంగా కనిపిస్తుంది. వారం రోజుల వ్యవధిలో రెండు జట్లపై విజయాలు సాధించి వరల్డ్ కప్ లో తమను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదకరమని చెప్పకనే చెప్పింది. జనవరి 26న ఐర్లాండ్ తో జరిగిన మూడో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో ఇటలీ ఘన విజయం సాధించింది. వరల్డ్ క్రికెట్ లో ఐర్లాండ్ తక్కువ జట్టేమీ కాదు. ఆ జట్టులోనూ ప్రమాదకర ఆటగాళ్లు ఉన్నారు. ఐర్లాండ్ కు ఇటలీ షాక్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

తమ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ ఇటలీ మరో జట్టును విజయాన్ని అందుకుంది. వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో భాగంగా ఇటలీ జట్టు కెనడాను ఓడించింది. సోమవారం (ఫిబ్రవరి 2) జరిగిన ఈ మ్యాచ్ లో 156 పరుగులను డిఫెండ్ చేసుకుని 10 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఛేజింగ్ లో కెనడా ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

వరల్డ్ కప్ లో ఇటలీ గ్రూప్ సిలో ఉంది. ఇటలీతో పాటు స్కాట్లాండ్, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్‌లు ఈ గ్రూప్ లో ఉన్నాయి. ఇటలీ ఫిబ్రవరి 9న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 12న ముంబైలో నేపాల్‌తో.. ఫిబ్రవరి 16న ఇంగ్లాండ్‌తో..  ఫిబ్రవరి 19న వెస్టిండీస్‌తో ఆడతారు. ఇటలీ తమ సంచలన ఆట తీరుతో సూపర్-8 కు వెళ్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా రేస్ లోకి వచ్చి తమ గ్రూప్ లోని జట్లకు ఛాలెంజ్ విసురుతుంది. 

►ALSO READ | ఆ విషయం నన్ను అడగకు: ఒక్క మాటతో పాక్ జర్నలిస్ట్‎ నోరు మూయించిన మార్ష్

ఇటలీకి ఇదే తొలి టీ20 ప్రపంచ కప్. ఈ స్క్వాడ్ లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జెజె స్మట్స్ ఇటలీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్మట్స్ సౌతాఫ్రికా తరపున 6 వన్డేలు, 13 టీ20 మ్యాచ్ లాడాడు. 2021లో చివరిసారిగా సౌతాఫ్రికా జట్టు తరపున ఆడిన స్మట్స్ కు ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో కోల్పోయాడు. స్మట్స్ కు ఇటలీ వారసత్వం ఉన్న కారణంగా వరల్డ్ కప్ జాతీయ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 
   
2026 టీ20 వరల్డ్ కప్ కు ఇటలీ జట్టు:

వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్‌ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.

©️ VIL Media Pvt Ltd.