Reading Time: 2 minutes

ఆ విషయం నన్ను అడగకు: ఒక్క మాటతో పాక్ జర్నలిస్ట్‎ నోరు మూయించిన మార్ష్

Caption of Image.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆటగాళ్లతో పాటు ఆ దేశ జర్నలిస్టులకు కూడా నోటి దూల ఎక్కువ. గ్రౌండ్‎లో పాక్ ప్లేయర్లు ఓవరాక్షన్ చేస్తే.. మ్యాచ్ ముందు, తర్వాత జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‎లలో ఆ దేశ జర్నలిస్టులు అతి చేస్తారు. సంబంధం లేని ప్రశ్నలతో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పిస్తుంటారు. తాజాగా ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్‎కు ఈ అనుభవం ఎదురైంది. మూడు టీ20ల సిరీస్‎లో భాగంగా ఆస్ట్రేలియా ప్రస్తుతం పాకిస్తాన్‎లో పర్యటిస్తోంది. 

సిరీస్‎లో చివరిదైన మూడో టీ20 సోమవారం (ఫిబ్రవరి 2) ముగిసింది. ఈ మ్యాచ్ అనంతరం మిచెల్ మార్ష్ ప్రెస్ కాన్షరెన్స్‎లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాను భర్తరఫ్ చేయడం, ఇండియా మ్యాచ్‎ను పాక్ బాయ్ కాట్ చేయడం గురించి జర్నలిస్టు మార్ష్‎ను ప్రశ్నించారు. దీంతో ఈ రెండు అంశాలపై స్పందించేందుకు మార్ష్ నిరాకరించాడు. 

ఆ విషయాలు మాకు అనవసరమని పాక్ జర్నలిస్ట్ నోరు మూయించాడు. తమ దృష్టి అంతా టీ20 వరల్డ్ కప్ పైనే ఉందని తేల్చి చెప్పాడు. వరల్డ్ కప్‎లో పాల్గొనంటున్న తమ జట్టుకు భద్రత విషయంలో టోర్నీ నిర్వాహకులపై తమకు నమ్మకం ఉందన్నాడు. 

►ALSO READ | T20 World Cup 2026: ఒకే గ్రూప్‌లో మూడు పటిష్టమైన జట్లు.. వరల్డ్ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’ అంటే ఇదే

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్  గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. కాగా, భద్రతా పరమైన కారణాలతో ఇండియాలో టీ20 వరల్డ్ కప్ ఆడలేమనడంతో బంగ్లాదేశ్‏ను ఐసీసీ టోర్నీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. బంగ్లాకు సంఘీభావంగా పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్‎ను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

కొలంబోకు చేరుకున్న ఆస్ట్రేలియా:

2026, ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయుక్త వేదికలుగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా తమ గ్రూప్ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడాల్సి ఉంది. దీంతో ఇప్పటికే ఆసీస్ జట్టు కొలంబోకు చేరుకుంది. ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో వరల్డ్ కప్ పోరును ఆస్ట్రేలియా స్టార్ట్ చేయనుంది. ఫిబ్రవరి 13న జింబాబ్వే, ఫిబ్రవరి 16న శ్రీలంక,  ఫిబ్రవరి 20న ఒమన్‏తో తలపడనుంది. 

©️ VIL Media Pvt Ltd.