Reading Time: < 1 minute

యాక్సిడెంట్లో చనిపోయిన లవర్.. కలలోకి వచ్చి రమ్మని పిలుస్తున్నాడని చనిపోయింది !

Caption of Image.

హైదరాబాద్: ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న బాధలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన RGIA పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సిద్ధార్థ గౌడ్, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన నర్మద.. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఇటీవల సిద్ధార్థ్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నర్మద, శంషాబాద్లోని సిద్ధార్థ కాలనీలో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది.

ప్రియుడు కలలోకి వచ్చి తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నర్మదా తన అక్క ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ALSO READ : నేపాల్‌లో మళ్లీ వరద బీభత్సం.. 

సమాచారం అందుకున్న ఆర్జీఐఏ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం దగ్గర లేఖను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.