
హైదరాబాద్: దానం నాగేందర్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయ్యారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ప్రకటించింది అసెంబ్లీ. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా చూపిస్తూ గెజిట్ విడుదల చేశారు అసెంబ్లీ కార్యదర్శి. 2024, ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్నట్లు చూపిస్తూ గెజిట్ విడుదల అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది మాత్రం 2026. సెప్టెంబర్ 18వ తేదీన.
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి సోమవారం (సెప్టెంబర్ 28) గెజిట్ విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2024, ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు గెజిట్లో పేర్కొన్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లు స్పీకర్ నోటీఫై చేయడంతో త్వరలోనే ఈసీ ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించనుంది. దానం నాగేందర్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయ్యారు.