Reading Time: 2 minutes

రోహిత్, కోహ్లీ వస్తున్నారంటే ఇట్లాగే ఉంటది.. IND vs WI టిక్కెట్లన్నీ 24 గంటల్లోనే సోల్డ్ ఔట్!

Caption of Image.

IND vs WI: వన్డే క్రికెట్ ఫార్మాట్‌కు ఆదరణ తగ్గిపోతోందంటూ వస్తున్న విమర్శలకు భారత క్రికెట్ ఫ్యాన్స్ తిరువనంతపురం వేదికగా గట్టి సమాధానం ఇచ్చారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సంబంధించి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ లభిస్తోంది. కేరళలోని తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌ టికెట్లన్నీ కేవలం 24 గంటల్లోనే హాట్‌కేకుల్లా అమ్ముడైపోవడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఏర్పడటానికి ప్రధాన కారణం టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడమే.

కింగ్, హిట్ మ్యాన్ రీఎంట్రీ: 

24 గంటల్లో టికెట్లు ఖాళీ: కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) సెప్టెంబర్ 17వ తేదీన తమ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా టికెట్ల విక్రయాలను స్టార్ట్ చేసింది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపట్లోనే అభిమానులు క్యూ కట్టడంతో, 24 గంటలు తిరిగేసరికి ఒక్క టికెట్ కూడా మిగలకుండా సేల్ అయిపోయాయి. 

స్టేడియం కిక్కిరిసిపోవడం ఫిక్స్: సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను మళ్లీ వన్డే జెర్సీలో ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తుండటంతో ఈ నెల 27వ తేదీన గ్రీన్ ఫీల్డ్ స్టేడియం హౌస్‌ఫుల్ కానుంది.

ఒకేసారి భారత జట్టు ధమాకా: 

* జపాన్ టూర్: ఒకవైపు యువ ఆటగాళ్లతో కూడిన భారత టీ20 జట్టు ఆసియా గేమ్స్ 2026 పాల్గొనేందుకు జపాన్ పర్యటనకు వెళ్లిపోయింది. మరోవైపు ప్రధాన సీనియర్ ప్లేయర్లతో కూడిన వన్డే జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో 3 వన్డేలు, అనంతరం 5 టీ20ల సిరీస్‌లో తలపడేందుకు రెడీ అవుతుంది. 

సెప్టెంబర్ 23న తిరువనంతపురం రాక: 

షెడ్యూల్ ప్రకారం, 3 వన్డేల సిరీస్ కోసం భారత్, వెస్టిండీస్ జట్లు ఈ నెల 23వ తేదీ వరకు తిరువనంతపురం చేరుకోనున్నాయి. అనంతరం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని సెప్టెంబర్ 27న జరగబోయే తొలి పోరుకు సిద్ధమవుతాయి. రీఎంట్రీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విజృంభించి భారీ స్కోర్లు సాధిస్తారని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.