Reading Time: < 1 minute

యూపీఐ చార్జీలు రద్దు చేయండి.. మంత్రి నిర్మలకు మొబైల్ ఫోన్ రిటైలర్ల రిక్వెస్ట్

Caption of Image.

న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలపై 0.40 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్​)  విధించే  ప్రతిపాదనను ఆలిండియా మొబైల్ ​రిటైలర్స్ ​అసోసియేషన్​ (ఏఐఎంఆర్‌‌‌‌ఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. ఎండీఆర్​ను రద్దు చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు లేఖ రాసింది.

 ఎండీఆర్​తో1.50 లక్షలకుపైగా  మొబైల్ వ్యాపారులకు కష్టాలు తప్పవని స్పష్టం చేసింది.   రిటైలర్లు మార్జిన్లు 0.75 శాతం–1.50 శాతమేనని తెలిపింది.  రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేసే రిటైలర్లపై ప్రతి నెలా  రూ.16 వేల వరకు అదనపు భారం పడుతుందని వివరించింది. స్మార్ట్‌‌‌‌ఫోన్ల ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయని తెలిపింది. గతంలో రూ.10 వేలకు లభించిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌‌‌‌ఫోన్ ధర ఇప్పుడు రూ.17 వేలకు చేరిందని పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.