Reading Time: < 1 minute

ఏఎండీ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లు …యూఎస్ మార్కెట్లో భారీగా పుంజుకున్న టెక్ షేర్లు

Caption of Image.

న్యూఢిల్లీ: కంప్యూటర్ల చిప్స్​ తయారు చేసే యూస్​కంపెనీ ఏఎండీ కంపెనీ షేర్లు 9.6 శాతం ఎగబాకి 613.31 డాలర్లకు చేరుకోవడంతో కంపెనీ మార్కెల్​ విలువ ట్రిలియన్​ డాలర్లకు (దాదాపు రూ.95 లక్షల కోట్లు) చేరింది. ఏఐ రంగంలో దూసుకుపోతున్న ఈ సంస్థ ఎన్విడియా, బ్రాడ్‌కామ్, మైక్రాన్ సరసన నిలిచింది. 

ఎన్విడియా ఇప్పటికే ఐదు ట్రిలియన్ డాలర్లకు పైగా విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. యూఎస్ మార్కెట్లో టెక్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఇంటెల్, క్వాల్కామ్ షేర్లు కూడా ర్యాలీ చేశాయి. 

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాల నేపథ్యంలో మదుపర్లు ఏఐ రంగంపై మళ్లీ దృష్టి పెట్టారు. ఏఎండీ సంస్థ కేవలం చిప్స్ మాత్రమే కాకుండా పూర్తి స్థాయి సిస్టమ్స్ తయారీలోకి అడుగుపెట్టింది. సెంట్రల్ ప్రాసెసర్లు, నెట్‌వర్కింగ్ పరికరాలను విక్రయిస్తూ మార్కెట్ వాటాను వేగంగా పెంచుకుంటోంది.

©️ VIL Media Pvt Ltd.