
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. ఓ కారు రైల్వే గేట్ బ్యారియర్‌ను ఢీకొట్టి నేరుగా రైల్వే ట్రాక్‌పైకి దూసుకెళ్లింది. ట్రాక్‌పై కారు ఇరుక్కుపోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు జాగ్రత్తగా మరో ట్రాక్‌లో వస్తున్న రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
మహామందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్వీ ప్యావు రైల్వే గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేఎస్ ప్రాంతంలో ఓ మహిళ కారులో వెళ్తుండగా బైక్‌ను ఢీకొట్టింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె కారు అదుపు తప్పి రైల్వే క్రాసింగ్ వైపు దూసుకెళ్లింది. రైల్వే గేట్ వద్దకు చేరుకున్న కారు వేగంగా బ్యారియర్‌ను ఢీకొట్టడంతో అది ధ్వంసమైంది. అనంతరం కారు నేరుగా రైల్వే ట్రాక్‌పైకి వెళ్లింది. అక్కడి నుంచి కారును వెనక్కి తీసేందుకు ప్రయత్నించగా.. టైర్ ట్రాక్‌లో ఇరుక్కుపోయింది. దీంతో వాహనం అక్కడే నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు జోధ్‌పూర్ నుంచి జైపూర్ వైపు వెళ్తున్న రైలు అదే సమయంలో సమీపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా రైలును కొద్దిసేపు నిలిపివేశారు. కారు మరో ట్రాక్‌పై ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం కారును ట్రాక్‌పై నుంచి తొలగించడంతో రైలు రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..