
తన నటన, గ్లామర్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి. అయితే లేటెస్ట్ గా ఈ బ్యూటీ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’, ‘గట్ట కుస్తీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌లతో అదరగొట్టిన ఈ బ్యూటీ.. ఇటీవల త్రివేండ్రంలో జరిగిన ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్ వివాదంపై పెదవి విప్పింది.
కెమెరా యాంగిల్స్‌తోనే ప్రాబ్లమ్.
ఈ మే నెలలో జరిగిన ఆ ఈవెంట్‌లో ఐశ్వర్య వేసుకున్న అవుట్‌ఫిట్‌పై కొందరు అనవసర ట్రోలింగ్ మొదలుపెట్టారు. దానికి లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఇచ్చిన కౌంటర్లతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలను సీరియస్ అయింది. ‘నా డ్రెస్ నాకు చాలా కంఫర్టబుల్‌గానే ఉంది. సమస్య నా డ్రెస్‌లో లేదు, అక్కడున్న కొందరు ఫొటోగ్రాఫర్ల ఆలోచనలోనే ఉంది అని నిప్పులు చెరిగింది.
ఫొటోగ్రాఫర్లు తన ముఖంపై కాకుండా అసభ్యకరమైన యాంగిల్స్‌లో ఫొటోలు తీయడానికి ప్రాధాన్యమిచ్చారని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేసింది. అలా సరికాని యాంగిల్స్‌లో క్లిక్ చేస్తున్నప్పుడు ఏ మహిళకైనా ఇబ్బందిగా అనిపించి, బాడీ లాంగ్వేజ్ మారిపోవడం సహజమని స్పష్టం చేసింది. తన పర్సనల్ బౌండరీస్‌ను దాటి ప్రవర్తించారని కుండబద్దలు కొట్టింది.
కల్చర్ పాఠాలు మాకొద్దు..
సమాజంలో మహిళల దుస్తులపై విమర్శలు చేసేవారికి గట్టి పంచ్ ఇచ్చింది ఐశ్వర్య. మహిళ ఏ బట్టలు వేసుకుంటే సంస్కృతి ఏమైపోతుందో అని గొడవ చేసేవారు… ఇతరులతో ఎలా ప్రవర్తించాలనే ‘నడవడికసంస్కృతి ‘ గురించి ఎందుకు మాట్లాడరు? నన్ను విమర్శించేవాళ్లకు దేశ జీడీపీ, వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రుల దైన్యం గురించి మాట్లాడేందుకు సమయం ఉండదు కానీ, ఓ మహిళ ఏం వేసుకుందో చర్చించడానికి మాత్రం బోలెడంత టైమ్ ఉంటుంది అని ప్రశ్నించింది.
ఇటీవలే తమిళంలో ‘గట్ట కుస్తీ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టింది ఐశ్వర్య లక్ష్మి. మలయాళంలో ‘ఆశ’ చిత్రంతో క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు బోల్డ్‌గా, స్ట్రైట్‌ఫార్వర్డ్‌గా వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు మహిళా భద్రత, ప్రైవసీపై సరికొత్త చర్చకు దారితీశాయి..