Reading Time: < 1 minute
India Vs Japan Team India Survive Scare To Win By Just 2 Runs

చారిత్రక మ్యాచ్‌లో టీ20 ఛాంపియన్ భారత్‌కు పసికూన జపాన్‌ చుక్కలు చూపించింది. అద్భుత బౌలింగ్, బ్యాటింగ్‌తో టీమిండియాను ఓడించినంత పనిచేసింది. శ్రేయాస్ సేనకు అదృష్టం కలిసొచ్చి విజయాన్ని అందుకుంది. 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్.. 5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 రన్స్ చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో జపాన్ విజయానికి 8 రన్స్ అవసరం కాగా.. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్స్ తీశాడు.

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత భారత్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరోసారి డకౌట్‌ కాగా.. మరో ఓపెనర్ సంజూశాంసన్‌ 9 పరుగులు చేశాడు. స్టార్ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ (3) స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (16) ఫర్వాలేదనిపించాడు. జపాన్‌ బౌలర్లలో ఛార్లీ హరా-హింజే రెండు వికెట్లు తీయగా.. ఇబ్రహిం తకహషీ, బెంజమిన్‌ ఇతో-డేవిస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.