Reading Time: < 1 minute

ఏపీలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం..7 గిగా వాట్ ప్లాంట్‌ను నిర్మించిన ప్రీమియర్ ఎనర్జీస్‌‌‌‌

Caption of Image.

న్యూఢిల్లీ: రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాలను తయారు చేసే ప్రీమియర్ ఎనర్జీస్ ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 7 గిగావాట్ల (జీడబ్ల్యూ) సామర్థ్యం గల  సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించింది. దీంతో కంపెనీ మొత్తం తయారీ సామర్థ్యం ఏకంగా 10.6 గిగావాట్లకు చేరుకుంది. 

తిరుపతి జిల్లా నాయుడుపేటలో 101 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ.3,293 కోట్ల  పెట్టుబడితో  ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీ యూనిట్ అని కంపెనీ వెల్లడించింది. ఈ  ప్లాంట్‌‌‌‌లో  ఎన్‌‌‌‌–-టైప్  టన్నెల్ ఆక్సైడ్ పాసివేటెడ్ కాంటాక్ట్ టెక్నాలజీతో కూడిన సోలార్ సెల్స్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తారు.

 ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేస్తే  గంటకు దాదాపు 88 వేల సెల్స్‌‌‌‌ను తయారు చేయగలదు. సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌ను డెవలప్ చేసేందుకు  మరో 10 గిగావాట్ల ఇంగాట్, 10 గిగావాట్ల వేఫర్  తయారీ ప్రాజెక్టులను కూడా నాయుడుపేట ప్లాంట్‌లోనే  ఏర్పాటు చేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.