
వేడి వేడి సాంబార్తో అన్నం తింటే ఆ టేస్టే వేరు. కానీ.. అదే సలసల లాడే సాంబార్ మీద పడితే మాత్రం తోలు ఊడి రావడం ఖాయం. పొరపాటున సాంబార్ మరుగుతున్న పాత్రలో పడితే దాదాపు ప్రాణం పోయినట్టే. సాంబారులో పడితే కాలిన గాయాలతో బతికే అవకాశాలు చాలా తక్కువ. విజయవాడలో ఇలాంటి విషాద ఘటనే జరిగింది.
A 46-year-old woman, identified as Sujatha, died after reportedly falling into a vessel of boiling sambar while helping with cooking for a Vinayaka Chavithi annadanam programme in Vijayawada. Police are investigating the accident. #AndhraPradesh pic.twitter.com/Oc0mgeseyn
— Ashish (@KP_Aashish) September 22, 2026
విజయవాడలోని చిట్టినగర్ ఏరియాలో వినాయకుడి విగ్రహాన్ని నిలబెట్టారు. ఈ క్రమంలో.. ఆదివారం అన్నదానం నిర్వహించారు. అన్నదానం సందర్భంగా.. క్యాటరింగ్ సిబ్బందిలోని ఇద్దరు మహిళలు సాంబార్ మరిగించిన పాత్రను పొయ్యి మీద నుంచి పక్కకు పెడుతున్నారు.
ఈ క్రమంలో.. అంత బరువున్న సాంబార్ పాత్రను కింద పెట్టేశాక.. ఇద్దరిలో సుజాత (46) అనే మహిళ అదుపు తప్పి సాంబార్ పాత్రలో పడిపోయింది. అక్కడే ఉన్న మహిళలు ఆమెను వెంటనే బయటకు తీశారు. అయితే.. సాంబార్ పాత్రలో పడిన క్రమంలో తలకిందులుగా పడిపోవడంతో తల భాగం తీవ్రంగా కాలిపోయింది. కొన్ని సెకన్లలోనే బయటకు తీసినప్పటికీ సలసల మరిగించిన సాంబార్ కావడంతో అప్పటికే బాధిత మహిళ తీవ్రంగా గాయపడింది.
అక్కడి నుంచి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విజయవాడ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజ్ రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.