
తనపై గతంలో ‘బ్లడ్ బ్యాంకు పెట్టి రక్తాన్ని అమ్ముకుంటున్నాడు’ అంటూ కొందరు విమర్శలు చేశారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఇలాంటి మాటలను తాను ఎప్పుడూ పట్టించుకోలేదని చెప్పారు. ఎవరినీ చేయి చాపకుండా, విరాళాలు తీసుకోకుండా తన కష్టార్జితంతోనే బ్లడ్ బ్యాంకును నడుపుతున్నానని తెలిపారు. అయితే ఇందులో తన కంటే అభిమానుల సహకారం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందన్నారు. అభిమానుల సేవకు వెలకట్టలేమని పేర్కొన్నారు. మన దగ్గర ఉన్న డబ్బు ఖర్చయితే మళ్లీ సంపాదించుకోవచ్చని.. కానీ గడిచిపోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేమని చిరంజీవి అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాను ఈ స్థాయికి రావడానికి తనకు ఎదురైన ప్రతి అనుభవం, ప్రతి క్షణం ఉపయోగపడ్డాయని చెప్పారు. తాను ఎలా ఎదిగానన్నదే కాకుండా.. అందుకు అనుసరించిన ఆలోచనా విధానం, క్రమశిక్షణ, ఆచరణలను అభిమానులు గమనించాలని కోరారు. తాను అదృష్టాన్ని నమ్మనని.. కష్టాన్ని మాత్రమే నమ్ముతానని చిరంజీవి చెప్పారు. నీరసంగా అనిపించినప్పుడు అద్దం ముందు నిలబడి తనను తాను ప్రోత్సహించుకుంటానని తెలిపారు. ప్రకృతికి మనం ఏది ఇస్తే.. అది కొన్ని రెట్లు తిరిగి ఇస్తుందని చెప్పారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని అభిమానులకు సూచించారు.
ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా
అభిమానుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదని చిరంజీవి ఆకాంక్షించారు. అన్ని హీరోల అభిమానులు సఖ్యతగా ఉండేలా చూడాలని కోరారు. హీరోలందరూ బాగున్నారని అభిమానులకు సందేశం ఇవ్వగలిగితే అందరూ కలిసి ఉంటారని చెప్పారు. తన తోటి హీరోలందరితోనూ తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. చిరంజీవి అభిమానులంటే అందరికీ గర్వకారణంగా ఉండేలా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ‘కాకా’ సినిమాలో నటిస్తున్నానని చిరంజీవి తెలిపారు. ఇందులో తన పాత్ర పేరు కదిరి కాళిదాసు అని చెప్పారు. సినిమా కోసం ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచి, గంటపాటు వ్యాయామం చేస్తున్నానని వెల్లడించారు. అనంతరం మేకప్ పూర్తి చేసుకుని ఉదయం 8 గంటలకు షూటింగ్ సెట్స్‌కు చేరుకుంటున్నానని చెప్పారు. ఇది గొప్పగా చెప్పుకోవడానికి కాదని.. తాను క్రమశిక్షణ పాటించకపోతే తనతో పనిచేసే టీమ్‌పై కూడా ప్రభావం పడుతుందని వివరించారు.
తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ
అమెరికా అధ్యక్షుడైనా.. సామాన్య కార్మికుడైనా అందరికీ 24 గంటల సమయమే ఉంటుందని చిరంజీవి అన్నారు. ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్నదే ముఖ్యమని చెప్పారు. ‘మెగా యూత్ ఫోర్స్’ మరింత బలోపేతం కావడానికి అభిమానుల సహకారం కావాలని కోరారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో అది అందించేందుకు తాను సిద్ధంగా ఉంటానని.. వారిని వీలైనంతగా అలరించడంపైనే తన దృష్టి ఉంటుందని చిరంజీవి తెలిపారు.
చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్ సరసన సీనియర్ హీరోయిన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.