Reading Time: 2 minutes

విద్యుత్ శాఖలో 110 ఉద్యోగాలు: 10th, ఐటీఐ పాసైతే చాలు.. పూర్తి వివరాలు ఇవే !

Caption of Image.

కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని  స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ (సీపీఆర్ఐ)  వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

మొత్తం ఖాళీలు: 110.

పోస్టు పేరు: ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్.1 (ఎలక్ట్రికల్/ సివిల్​).

మొత్తం ఖాళీలు: 8.

విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌, సివిల్​లో ఫస్ట్ క్లాసుతో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 2024, 2025 లేదా 2026 ఏళ్లల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండటం తప్పనిసరి.

వయసు: 30 ఏళ్లు ఉండాలి. 

సెలెక్షన్ ప్రాసెస్: గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పోస్టు పేరు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్/ మెకానికల్).

మొత్తం ఖాళీలు: 11.

విద్యార్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ టెక్నాలజీలో ఫస్ట్ క్లాసుతో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి.

వయసు: 35 ఏళ్లు ఉండాలి. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్.

మొత్తం ఖాళీలు: 2.

విద్యార్హత: కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫస్ట్ క్లాసుతో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి.

వయసు: 35 ఏళ్లు ఉండాలి. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పోస్టు పేరు: టెక్నీషియన్ గ్రేడ్.1 (ఎలక్ట్రికల్/ మెకానికల్).

మొత్తం ఖాళీలు: 2.

విద్యార్హత:  ఎలక్ట్రికల్ మెకానికల్​లో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

వయసు: 28 ఏళ్లు ఉండాలి. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పోస్టు పేరు: టెక్నికల్ అటెండెంట్ గ్రేడ్.1

మొత్తం ఖాళీలు: 37.

విద్యార్హత: మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత ఉండాలి. అలాగే, ఎలక్ట్రికల్/ మెకానికల్ విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.  

వయసు: 30 ఏళ్లు ఉండాలి. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పోస్టు పేరు: అసిస్టెంట్ గ్రేడ్.II 

మొత్తం ఖాళీలు: 29.

విద్యార్హత: ఫస్ట్ క్లాసుతో బీఏ/ బీఎస్సీ/ బి.కాం/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ పూర్తిచేసి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ కోర్స్ (బీసీసీ) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

వయసు: 30 ఏళ్లు ఉండాలి. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పోస్టు పేరు: మల్టీ– టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 

గ్రేడ్.1(వాచ్ అండ్ వార్డ్ డ్యూటీస్).

మొత్తం ఖాళీలు: 14. 

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 25 ఏళ్లు ఉండాలి. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ట్రేడ్/ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 19.

అప్లికేషన్  ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. 

ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్.1, ఇంజినీరింగ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.1000, టెక్నీషియన్ గ్రేడ్.1, అసిస్టెంట్ గ్రేడ్.II, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్.1 పోస్టులకు మిగతా అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: అక్టోబర్ 12. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  cpri.res.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.