Reading Time: 2 minutes
Actor: తెలుగులో తిరుగులేని లవర్ బాయ్.. వరుస ప్లాపులతో ఫేడౌట్.. రీఎంట్రీ కోసం చూస్తున్న ఫ్యాన్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ లవర్ బాయ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు తరుణ్. అప్పట్లో వరుస హిట్లతో సెన్సేషన్ అయ్యాడు. కానీ వరుస ప్లాపులతో ఫేడౌట్ అయ్యాడు. దీంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నటుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన స్నేహితుడు తరుణ్ సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తరుణ్ మళ్ళీ సినిమాల్లోకి వస్తే అద్భుతాలు చేయగలడని, విభిన్న పాత్రలు, ముఖ్యంగా హీరోయిజంలో కొత్త కోణాలను ఎంచుకుంటే విజయం సాధించగలడని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఓటీటీల రాకతో సినీ పరిశ్రమలో అవకాశాలు పెరిగాయని, చాలా మంది నటులు తిరిగి తమదైన ముద్ర వేయగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

తరుణ్ గొప్ప నటుడని, ఇప్పటికీ సినిమాల్లోకి తిరిగి వచ్చి అద్భుతాలు చేయగలడని రాజీవ్ అభిప్రాయపడ్డారు. హీరోయిజంలో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటే తరుణ్ ఖచ్చితంగా విజయం సాధిస్తాడని, నిర్ణయం తీసుకోవాల్సింది తరుణేనని రాజీవ్ అన్నారు. తరుణ్ తల్లి రోజారమణి గారి జోక్యం వంటి పుకార్లను ఆయన కొట్టిపారేశారు. ఓటీటీ వేదికల విస్తరణతో నటులకు కొత్త అవకాశాలు వస్తున్నాయని, ఒకప్పుడు హీరో పాత్రలకే పరిమితమైన వారు ఇప్పుడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారని, శ్రీరామ్ వంటి నటులు దీనికి నిదర్శనమని రాజీవ్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

తరుణ్ విషయానికి వస్తే.. బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించి, యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. 1990లో వచ్చిన ‘అంజలి’ (దర్శకుడు మణిరత్నం) సినిమాతో బాలనటుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆయన నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డ్ అందుకున్నారు. 2000లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచి, తరుణ్‌కి రాత్రికి రాత్రే భారీ స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత హిట్లతో సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత వరుస ప్లాపులు అందుకున్నారు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

తరుణ్..

 

View this post on Instagram

 

A post shared by Tharun (@actortarun)

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..