Reading Time: 2 minutes
Honda Qc3 Electric Scooter Price Range Battery Features India

Honda QC3 Electric Scooter Launched: సిటీల్లో ఆఫీసులకు వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లాలన్నా లేదా ఇంట్లో చిన్న చిన్న పనులకైనా ఇప్పుడు చాలామందికి ఎలక్ట్రిక్ స్కూటర్లే ఫస్ట్ ఛాయిస్ అయిపోయాయి. రోజురోజుకూ ఇవి బాగా పాపులర్ అవుతుండటంతో హోండా కంపెనీ కూడా ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా ‘Honda QC3’ పేరుతో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఇది ఇండియాలో హోండా నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర (న్యూ ఢిల్లీ) రూ.1,35,000గా ఉంది. ప్రస్తుతం దీన్ని ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లామ్ నగరాల్లోని సెలెక్టెడ్ హోండా రెడ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. లాంచ్ చేసిన రోజు నుంచే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. రూ.5,000 అడ్వాన్స్ అమౌంట్ కట్టి ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఇక పవర్, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో 3.0 kWh బ్యాటరీ ఇచ్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 145 కిలోమీటర్ల దూరం (IDC సర్టిఫైడ్) ప్రయాణించవచ్చని కంపెనీ చెప్తోంది. ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్‌గానే అవుతుంది. కేవలం 2 గంటల 40 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. అలాగే పూర్తిగా 100 శాతం ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. దీన్ని కేవలం ఒక స్కూటర్‌లా కాకుండా, ఫ్యామిలీకి అన్ని రకాలుగా ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఇందులో 32 లీటర్ల పెద్ద స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, కాబట్టి రోజూ కావాల్సిన సామాన్లు లేదా బ్యాగులు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. రోజువారీ వాడకాన్ని మరింత ఈజీ చేయడానికి దీనికి స్మార్ట్ కీ (Smart Key) సదుపాయం కూడా ఇచ్చారు.

సాంకేతికత పరంగా చూస్తే.. ఇందులో 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌కి కనెక్ట్ అవుతుంది, కాబట్టి సిటీలో వెళ్లేటప్పుడు రూట్ సరిగ్గా తెలియకపోతే టర్న్-బై-టర్న్ నేవిగేషన్ చూస్తూ ఈజీగా ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ మ్యాట్ ఫాంటమ్ గ్రే మెటాలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్, పర్ల్ షాలో బ్లూ, పర్ల్ సైరన్ బ్లూ అనే నాలుగు అట్రాక్టివ్ కలర్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం ఇది పైన చెప్పుకున్న ఐదు నగరాల్లోనే అందుబాటులో ఉన్నప్పటికీ, సిటీలో రోజువారీ వాడకానికి ఒక మంచి ఫ్యామిలీ ఈవీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.