Reading Time: < 1 minute

పెళ్లి ఆగిపోతే.. ఆ ముగ్గురి పరిస్థితి..? ఇంట్రెస్టింగ్‎గా ఇంప్యూర్ స్టోరీ లైన్

Caption of Image.

సాయి కృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంప్యూర్’. నిశాంతి ఇవని దర్శకత్వంలో  వారాహి మల్లిపాముల, శ్రీదేవి నిర్మించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ ‘నిశాంతి నాకు 15 ఏళ్లుగా తెలుసు. తను మంచి ఆర్టిస్ట్‌‌‌‌ కూడా. 

ఈ సినిమాతో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా మారడం సంతోషంగా ఉంది. పేరేంట్స్ ఎంకరేజ్ చేస్తే  ఏదైనా సాధించగలమని నిశాంతి ప్రూవ్ చేసింది. మూవీ సక్సెస్‌‌‌‌తో టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. ఈ చిత్రంలో తమ పాత్రలు అందర్నీ ఆకట్టుకుంటాయని సాయి కృష్ణ, యష్న అన్నారు. 

డైరెక్టర్ నిశాంతి మాట్లాడుతూ ‘ఒక మనిషి ప్యూర్‌‌‌‌గా ఉండాలా..? ఇంప్యూర్‌‌‌‌గా ఉండాలా..? అనేది సొసైటీ డిసైడ్ చేస్తుంది. పెళ్లి ఆగిపోవడం వల్ల లీడ్‌గా నటించిన ముగ్గురి పరిస్థితి ఎలా మారింది అనేది ఈ సినిమా కథ’ అని చెప్పింది.  ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు అన్నారు. నటుడు పృథ్వీరాజ్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.