Reading Time: < 1 minute
Tollywood Heroes Are Producing And Directing Their Own Films In Pursuit Of A Hit

టాలీవుడ్ యంగ్ హీరోలు రూట్ మారుస్తున్నారు. కేవలం నటనకే టైం కేటాయించకుండా రైటర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌గా ఫ్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా నుండి తనలోని హిడెన్ టాలెంట్స్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు రామ్ పోతినేని. ఈ మూవీలో లిరిసిస్ట్‌గా మారి ఓ సాంగ్ రాసిన రాపో.. సింగర్‌గానూ అవతారమెత్తాడు. నెక్ట్స్‌ దర్శకుడిగా మారబోతున్నాడు ఈ యంగ్ హీరో. తన 23వ ప్రాజెక్ట్‌తో కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోబోతోంది.

టాలీవుడ్‌లో మల్టీటాస్కులు చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఓ వైపు యాక్టర్‌గా, మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో.. ఇప్పుడు దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నాడు. తన 13వ సినిమాకు మెగాఫోన్ పట్టబోతున్నాడు యంగ్ టాలెంట్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. రియాలిటీ టైటిల్ పరిశీలనలో ఉంది.. త్వరలో అప్డేట్ ఇస్తానని రీసెంట్లీ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. రామ్, కిరణ్ అబ్బవరం బాటలో నడుస్తున్నాడు కార్తీకేయ గుమ్మన కొండ. భజే వాయు వేగం తర్వాత కనిపించని ఈ హీరో మెగా ఫోన్ పట్టబోతున్నట్లు రీసెంట్లీ వెల్లడించాడు. బర్త్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేశాడు. పవర్ ఫుల్ టైటిల్ కంబ్యాక్‌తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. బాక్సింగ్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు రైటర్ కమ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు కార్తీకేయ.