Reading Time: < 1 minute
Kayadu Lohar Comments On Director Srikanth Odela The Paradise

సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎత్తయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పనిచేయడమే అసలైన సవాలు అని, భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇలాంటి కొంచెం వింతైన (eccentric) ఆలోచనలున్న డైరెక్టర్ మరొకరు ఉండరని కయాదు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్ర కథానాయిక కయాదు లోహర్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరుపై చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మీకు అత్యంత కఠినమైన లేదా సవాలుగా అనిపించిన అంశం ఏమిటని ప్రశ్నించగా.. ఏమాత్రం తడుముకోకుండా “శ్రీకాంత్ సార్‌తో పనిచేయడమే” అని కుండబద్దలు కొట్టింది. ఆయన ఒక చాలా డిఫరెంట్, కాస్త ఎక్సెంట్రిక్ డైరెక్టర్ అని, తెలుగులోనే కాకుండా యావత్ భారత చిత్ర పరిశ్రమలోనే అలాంటి వ్యక్తిని చూడలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సెట్స్‌లో తనకు ఎన్నో కఠినమైన పరీక్షలు పెట్టారని, ఒక నటిగా ఆయన్ను మెప్పించడం పెద్ద టాస్క్‌లా మారిందని గుర్తుచేసుకుంది. అయితే దర్శకుడికి ఉన్న ఆ విలక్షణతే సినిమాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆమె చివర్లో సమర్థించుకుంది.