Reading Time: < 1 minute

తిరుమల : అలిపిరి నడకమార్గంలో చెట్టుపై పులి

Caption of Image.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు అలిపిరి నడక మార్గం గుండా కాలినడకన కొండపైకి చేరుకుంటారు. ఈ పవిత్రమైన ప్రయాణంలో భాగంగా భక్తులు 2765వ మెట్టు సమీపంలో ఓ పెద్ద చెట్టుపై కూర్చొని ఉన్న చిరుతను భక్తులు గమనించారు. చిరుతను‌ చూసి భక్తులు  భయాందోళనకు గురయ్యారు.  భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు భద్రతా సిబ్బంది.

పిల్లలు, వృద్ధులు, మహిళలు ఆ భయానక దృశ్యానికి తీవ్రంగా ఉలిక్కిపడ్డారు. క్షణాల్లో ఈ వార్త నడకమార్గం గుండా వెళ్తున్న మిగతా భక్తులందరికీ చేరడంతో అక్కడ పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రాణభయంతో భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కొంతసేపు నడకమార్గంలో ఉత్కంఠ భరిత వాతావరణం ఏర్పడింది. 
 

©️ VIL Media Pvt Ltd.