
MS Dhoni’s IPL Future: భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ భవిష్యత్తుపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సీఎస్కే హెడ్ కోచ్‌గా నియమితులైన తర్వాత, ధోనీ కోచ్‌గా లేదా మెంటార్‌గా అవతారమెత్తుతాడంటూ వస్తున్న వార్తలకు చెన్నై మేనేజ్‌మెంట్ చెక్ పెట్టింది. ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌లో ధోనీ ఆటగాడిగానే (As a Player) బరిలోకి దిగుతాడని చెన్నై సంచలన ప్రకటన చేసింది.
మెంటార్ కాదు.. ప్లేయర్ మాత్రమే: కాశీ విశ్వనాథన్
స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఎంఎస్ ధోనీనే ఆ బాధ్యతలు తీసుకుంటాడని లేదా మెంటార్‌గా వ్యవహరిస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ (MD) కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ధోనీ మాకు ఒక ఆటగాడిగానే అందుబాటులో ఉంటాడని తేల్చి చెప్పారు. తీవ్ర గాయాల కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు ధోనీ దూరమయ్యాడు. యంగ్ టీమ్‌పై నుంచి దృష్టి మల్లకుండా ఉండటానికి, తన సొంత గ్రౌండ్ అయిన చెపాక్ (MA Chidambaram Stadium) స్టేడియానికి కూడా వెళ్లకుండా ధోనీ దూరంగా ఉన్నాడు.
జహీర్ ఖాన్‌తో ధోనీ మాస్టర్‌ప్లాన్:
జహీర్ ఖాన్‌ను సీఎస్కే హెడ్ కోచ్‌గా ఎంపిక చేయడంలో మహేంద్ర సింగ్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. జహీర్‌పై ధోనీకి ఉన్న అపారమైన గౌరవం, వారిద్దరి అనుబంధం సీఎస్కేను మళ్లీ విజయాల బాట పట్టిస్తుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
కొత్త కోచ్ జహీర్ ఖాన్‌కు సవాలు:
* 45 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్: 45 ఏళ్ల వయసులో ఎంఎస్ ధోనీ రిఫ్లెక్సెస్, కన్సిస్టెన్సీపై అనేక సందేహాలు ఉన్నాయి.
* ఇంపాక్ట్ ప్లేయర్ రూల్: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అందుబాటులో ఉన్నప్పటికీ, మైదానంలో సెంటిమెంట్‌ను పక్కనపెట్టి ధోనీ నైపుణ్యాన్ని టీమ్ కాంబినేషన్‌కు తగ్గట్టు జహీర్ ఎలా వాడుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సీఎస్కే ట్రాక్ రికార్డ్ ఇదే:
ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం తమ చరిత్రలోనే అత్యంత దారుణమైన స్థితిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా, ధోనీ మైదానంలో ప్లేయర్‌గా కలిసి పని చేసి ఐపీఎల్ 2027లో సీఎస్కేకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చిపెడతారో అనేది వేచి చూడాల్సిందే.
* 2024 సీజన్: 5వ స్థానం
* 2025 సీజన్: 10వ స్థానం (పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం)
* 2026 సీజన్: 8వ స్థానం