Reading Time: < 1 minute
Actor Vishal Questions Cm Vijay Film Portfolio Rajmohan

Actor Vishal: నటుడు విశాల్, సీఎం విజయ్‌ను ప్రశ్నించడం తమిళనాడులో సంచలనంగా మారింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజమోహన్‌ను నియమించడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించిన విశాల్.. సినిమా సంబంధిత మంత్రిత్వ శాఖను రాజమోహన్‌కు ఇవ్వడం నిరాశ కలిగించిందని అన్నారు. దశాబ్ధాలుగా సినిమా రంగంలో ఉన్నందును ఈ శాఖను నిర్వహించడంతో విజయ్ సమర్థుడని ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉందని, తక్షణమే సంస్కరణలు, ఉపశమన చర్యలు అవసరమని విశాల్ నొక్కి చెప్పారు.

ఇదే సమయంలో మంత్రి రాజమోహన్‌ను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని అన్నారు. ఇండస్ట్రీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఒక ఆశాకిరణం కోసం ఎదురుచూస్తున్నాయని విశాల్ అన్నారు. విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు కీలక డిమాండ్లను పెట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేయాలని, దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. ‘‘వన్ ఇండియా వన్ టాక్స్’’ ఉన్నప్పటికీ, ద్వంద్వ పన్నులు విధిస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అని అన్నారు. స్థానిక సంస్థల పన్నుల్ని తొలగించాలని కోరారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలు పెంచాలని అభ్యర్థించారు.