Reading Time: < 1 minute
Big Shock For Vehicle Owners Petrol Diesel Prices Hiked Across India Check New Rates

Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు బిగ్ షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం భారత్ పై నేరుగా ప్రభావం చూపిస్తోంది. హార్మూజ్ జలసంధి ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో కొరత ఏర్పడింది.

చమురు ధరలు పెరగడంతో ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ కూడా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. ఇంధన ధరలు పెరగడంతో వాహనదారులకు మరింత భారం కానుంది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 97.77 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 99.67 కు చేరుకుంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో, రిటైల్ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోందని ఈ పెరుగుదల సూచిస్తోంది.