
భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఎస్.ఎస్. రాజమౌళి గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒక్క హిట్ కొట్టడమే ఎక్కువ అనుకుంటే.. ఏకంగా వరుసగా 12 హిట్స్ అందుకున్నారీ స్టార్ డైరెక్టర్. అందులోనూ చాలావరకు ఇండస్ట్రీ హిట్సే ఉన్నాయి. సమకాలీన దర్శకుల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో అపజయమెరుగని దర్శకుడిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రాజమౌళి. ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ వరల్డ్ రేంజ్ కు ఎదిగిపోయారాయన. ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, హాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న జక్కన్న ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘వారణాసి’ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కాగా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నితిన్, నాని, రవితేజ, సునీల్.. ఇలా చాలా మంది హీరోలతో సినిమాలు తెరకెక్కించారు రాజమౌళి. హీరోలను దగ్గరుండి చూసే ఆయనకు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? రాజమౌళి యూత్ లో ఉన్నప్పుడు ఒక స్టార్ హీరో అంటే అతనికి విపరీతమైన ఇష్టం ఉండేదట. ఆ స్టార్ హీరో కోసం చొక్కాలు చించుకొని మరి సినిమాలకు వెళ్లారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా? పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
పవన్ కల్యాణ్ కల్ట్ లవ్ స్టోరీ ‘తొలిప్రేమ’ సినిమా తర్వాత రాజమౌళి పవర్ స్టార్ కు అభిమానిగా మారిపోయారట. ఆ సినిమా కోసం ఆయన కూడా చొక్కాలు చించుకున్నారట. అయితే ఆశ్చర్యకరంగా పవర్ కల్యాణ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు రాజమౌళి. మరి రాబోయే రోజుల్లోనైనా ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కుతుందేమో చూడాలి.
ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్..
Theatres erupted
Fans celebratedPSPK dancing to #DekhlengeSaala on the big screens is just a special vibe
Watch #UstaadBhagatSingh today.
https://t.co/AoKtmL8ILe#BlockbusterUBS pic.twitter.com/GhhKWSpl6N
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 23, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



