Reading Time: < 1 minute

దాడులకు భయపడి..ఇరాన్ డీల్ కోసం ఆరాటపడుతోంది: ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

Caption of Image.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల  నడుమ ట్రంప్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ స్వయంగా చర్చలకు వచ్చిందని..డీల్ కోసం ఆరాటపడుతోందన్నారు. కాల్పుల విరమణ కోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ వైపు నుంచి తనను సంప్రదించారని పేర్కొన్నారు. అయితే తాము అమెరికాను ఎప్పుడూ సంప్రదించలేదని ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

చర్చల కోసం ఇరానే ముందుగా సంప్రదించిందని ట్రంప్ చెప్పొకొచ్చారు. అణ్వాయుధాల తయారీని నిలిపివేసేందుకు ఇరాన్ ఒప్పుకుందని చెప్పడం ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన అంశం.ఒకవైపు ఇరాన్  చర్చలే లేవు అంటుంటే మరోవైపు ట్రంప్  డీల్ దాదాపు ఖాయం అనే సంకేతాలిస్తున్నారు.తమ దేశ ఇంధన వనరులపై అమెరికా దాడులు చేస్తుందనే భయంతో ఇరాన్ చర్చలకు వచ్చిందని ట్రంప్ చెప్పారు. 

గత రెండు రోజులుగా తాను ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నానని, ఘర్షణలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా జరుగుతున్న ఈ చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ అంతకుముందు చేసిన ప్రకటన క్రమంలో ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడ్డాయి. 

ఇరాన్‌లో అధికార మార్పు ఖాయం.. ట్రంప్​ 

ఇరాన్ ప్రస్తుత పాలన అంతం కావచ్చని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇరాన్ ప్రభుత్వంలోని పలువురు కీలక నేతలు సైనిక చర్యల్లో హతమయ్యారని, త్వరలోనే అక్కడ అధికార మార్పు జరగడం ఖాయమన్నారు. వెనిజులా ఉదాహరణను ఉటంకిస్తూ, చమురు ఒప్పందాల కోసం ఇరాన్‌లో కూడా తమకు అనుకూలంగా ఉండే ఒక సరైన వ్యక్తిని కనుగొంటామని ట్రంప్ చెప్పారు. ఈ దౌత్యపరమైన పరిణామాలు చమురు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.