Reading Time: < 1 minute
Jasprit Bumrah Retirement Warning Ashwin Team India Bowling Future

Ravichandran Ashwin: టీమిండియాలో జస్ప్రీత్ బుమ్రా పాత్రను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీలక మ్యాచుల్లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్పులోనూ బుమ్రా అసాధారణ బౌలింగ్ అందరినీ ఆకట్టుకుంది. విదేశీ ప్లేయర్స్ సైతం ఈ యార్కర్ కింగ్ ప్రతిభను మెచ్చుకున్నారు. బుమ్రా తరువాత టీమిండియా పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు వచ్చింది. ఈ అంశంపై వివరిస్తూ అశ్విన్ కీలక హెచ్చరిక జారీ చేశారు. టీమ్ ఇండియా విజయాల్లో బుమ్రా పాత్ర వెలకట్టలేనిదని, ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడని కొనియాడారు. అయితే, బుమ్రా తర్వాత అతని స్థాయి బౌలర్‌ను వెతకడం భారత్‌కు అంత సులభం కాకపోవచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డారు. బుమ్రా రిటైర్మెంట్ తర్వాత జట్టు ఇబ్బందులు పడుతుందని అశ్విన్ తెలిపారు. భారత్‌కు బలమైన బ్యాటింగ్ విభాగం ఉన్నప్పటికీ.. బ్యాటర్ల ఆధిపత్యం ఉన్న ఈ ఫార్మాట్‌లో నెక్ట్స్‌ జనరేషన్ ఆటగాళ్లకు బౌలింగ్‌ను అంతగా ఇష్టపడటం లేదన్నారు.

READ MORE: CM Chandrababu: నాది దేవుడి దగ్గర ఒకటే సంకల్పం.. అమరావతి దేవతల రాజధాని అవ్వాలి!

‘రెవ్‌స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మన దగ్గర వైట్ బాల్ బ్యాటర్లు అనేక మంది ఉన్నారు. వాళ్ల బ్యాటింగ్ ప్రతిభ అద్భుతంగా ఉంది. రాబోయే దశాబ్దంలో టీమిండియా మరిన్నీ ఐసీసీ ట్రోఫీలు గెలిచేందుకు ఇలాంటి అద్భుతమైన బ్యాటింగ్ కారణమవుతుంది. కానీ.. ప్రస్తుతం క్రికెట్ పూర్తిగా మారిపోయింది. బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. బ్యాటర్లు సిక్సర్లు కొట్టి ప్రేక్షకులను అలరించడమే ప్రధానంగా మారింది. ప్రేక్షకులు కూడా బ్యాటర్ల ప్రద్శనలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ తరుణంలో నేటి జనరేషన్ పిల్లలు బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. బౌలింగ్‌పై ఆకర్శన తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో టీమిండియాకు నాణ్యమైన బౌలర్లు దొరకడం కష్టతరమవుతుంది.” అని అశ్విన్ హెచ్చరించాడు. అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

READ MORE: Stock Market: 5 నిమిషాల్లో రూ.8 లక్షల కోట్ల లాస్.. పేకమేడలా కుప్పకూలిన స్టాక్ మార్కెట్!