
గత సంవత్సరం విడుదలైన GT 30 Pro మోడల్‌కు సక్సెసర్ గా, ఇన్ఫినిక్స్ GT 50 Pro శుక్రవారం ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో విడుదలైంది. గేమింగ్‌పై దృష్టి సారించిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 12GB RAM, 512GB వరకు స్టోరేజ్ జత చేశారు. 10 ప్రెజర్ లెవెల్స్‌తో కూడిన ప్రెజర్-సెన్సిటివ్ షోల్డర్ ట్రిగ్గర్‌లను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ GT 50 Proలో 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లే, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ GT 50 ప్రో బేస్ 12GB RAM + 256GB మోడల్ ధర IDR 69,98,000 (సుమారుగా రూ. 35,000) నుండి ప్రారంభమవుతుంది. అదే పరిమాణంలో RAM కలిగిన 512GB స్టోరేజ్ వేరియంట్ ధర IDR 74,99,000 (సుమారుగా రూ. 40,000). ఇది ఇండోనేషియా ఇ-కామర్స్ సైట్లలో జాబితా అయ్యింది. బ్లాక్ అబిస్, రెడ్ బ్లేజ్, సిల్వర్ గ్లేసియర్ రంగులలో అందుబాటులో ఉంటుంది.
స్పెసిఫికేషన్లు
డ్యూయల్-సిమ్ (నానో + నానో) ఇన్ఫినిక్స్ GT 50 ప్రో ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 పై పనిచేస్తుంది. ఇందులో 93.18 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కూడిన 6.78-అంగుళాల AMOLED LTPS 1.5K (1,208×2,644 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 30Hz నుండి 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. దీనికి 330Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 2800Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ప్యానెల్ 4500 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని, DCI-P3 కలర్ గామట్‌ను 100 శాతం కవరేజీని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది TÜV లో బ్లూ లైట్ సర్టిఫైడ్, దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా రక్షించబడింది. ఇన్ఫినిక్స్ GT 50 ప్రో లోపల, 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్, మాలి-G720 MC7 GPU ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 12GB వరకు LPDDR5x RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ కూడా ఉన్నాయి.
కెమెరాల విషయానికొస్తే, ఇన్ఫినిక్స్ GT 50 ప్రోలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.59 అపర్చర్, OISతో కూడిన 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, f/2.2 అపర్చర్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, 13-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
ఇన్ఫినిక్స్ GT 50 ప్రోలో G-సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఇందులో X-యాక్సిస్ లీనియర్ మోటార్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, OTG, NFC, FM రేడియో, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
దాని మునుపటి మోడల్ అయిన ఇన్ఫినిక్స్ GT 30 ప్రో లాగే, కొత్త ఇన్ఫినిక్స్ GT 50 ప్రోలో కూడా ‘ఓపెన్-కట్ ప్రెజర్-సెన్స్ GT ట్రిగ్గర్’ అని పిలువబడే ప్రెజర్-సెన్సిటివ్ షోల్డర్ ట్రిగ్గర్‌లు ఉన్నాయి. ఈ ట్రిగ్గర్‌లు కన్సోల్ లాంటి గేమింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ప్రతి ట్రిగ్గర్‌లో నాలుగు సర్దుబాటు చేయగల మ్యాపింగ్ పాయింట్లు, 10 ప్రెజర్ లెవెల్స్ ఉంటాయి. దీని లేటెన్సీ రేటు 20ms, దీని నిర్మాణం చాలా దృఢంగా ఉంటుంది. ఇది 3 మిలియన్ల సార్లకు పైగా పనిచేస్తుందని పేర్కొన్నారు. GT ట్రిగ్గర్ యాప్‌లను వేగంగా ప్రారంభించడానికి, వీడియో ప్లేబ్యాక్‌ను నియంత్రించడానికి, లైటింగ్ ఎఫెక్ట్‌లను అనుకూలీకరించడానికి, మరిన్నింటికి సహాయపడుతుంది.
అదనంగా, మెరుగైన కనెక్టివిటీ కోసం ఇన్ఫినిక్స్ GT 50 ప్రోలో కంపెనీ, సొంత N1 నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ చిప్‌ను పొందుపరిచారు. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో ఇన్ఫినిక్స్ ‘హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్’ కూడా ఉంది. దీనిలో ఉష్ణ వెదజల్లుటకు, వేగవంతమైన ఉష్ణ ప్రసరణకు 6,437 చదరపు మిల్లీమీటర్ల డయాఫ్రమ్ వైశాల్యంతో కూడిన మైక్రో-పంప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది.
ఇన్ఫినిక్స్ GT 50 ప్రో 6,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 45W వరకు వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వరకు రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 30W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్, 5W వరకు వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇన్ఫినిక్స్ GT మ్యాగ్‌ఛార్జ్ కూలర్ 2.0తో ఉపయోగించినప్పుడు, ఈ హ్యాండ్‌సెట్ వైర్‌లెస్ బైపాస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.