Reading Time: < 1 minute
Hero Sree Vishnu Upcoming Movies Lineup 2026 Sitara Entertainments Ram Abbaraju

టాలీవుడ్ యంగ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘విష్ణు విన్యాసం’, ‘మృత్యుంజయ్’ సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ హీరో, ఇప్పుడు తన దృష్టినంతా రాబోయే నాలుగు క్రేజీ ప్రాజెక్టులపై పెట్టాడు.

భారీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. అలాగే శ్రీవిష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘సామజవరగమన’ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో మరోసారి జతకట్టాడు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ హిల్లేరియస్ కామెడీ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటుగా భాను భోగవరపు ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉన్న.. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. పవన్ బసంశెట్టి‌తో మూవీ విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఇలా..

శ్రీవిష్ణు మొత్తనికి ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడం విశేషమే అయినా, ట్రేడ్ వర్గాలు అభిమానులు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌లో ఉన్న బలాన్ని వాడుకుంటూనే, కొత్తదనం చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.