Reading Time: < 1 minute
Gold Prices: బంగారం ధరలు ఒక్కసారిగా ఢమాల్.. మరింత పడిపోయే అవకాశం.. కారణం ఇదే..

బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్ న్యూస్. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం ముగియడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గడంతో బంగారం ధరలు దొగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పతనమవుతూ సామాన్యులకు ఊరట కల్గిస్తున్నాయి. ధరలు పడిపోతుండటంతో, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం తులం బంగారం రూ.1.52 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇటీవల రూ.1.56 లక్షల వద్ద ఉండగా. వారం రోజుల్లోనే కుప్పకూలింది. డాలర్ బలపడటంతో పాటు యుద్దం ముగియడం, హార్ముజ్ జలసంధిపై క్లారిటీ రావడంతో ధరలు క్రమక్రమంగా తగ్గముఖం పడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

డాలర్ బలపడటమే కారణం

అయితే డాలర్ బలపడుతుండటంతో బంగారం ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరో కొద్ది రోజుల పాటు తగ్గుదల ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే డాలర్ బలపడితే బంగారంపై ఒత్తిడి పెరుగుతుంది. బంగారం లాంటి వడ్డీ రాని ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతుంది. దీని వల్ల గోల్డ్ రేట్లు తగ్గుతాయి. ప్రస్తుతం డాలర్ బలపడటం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టడంతో ధరలు కుప్పకూలుతున్నాయి. మరికొద్ది రోజులు ఇదే తగ్గుదల కొనసాగితే బంగారం ధరలు మరింత తగ్గుతాయని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక హర్ముజ్ జలసంధి ప్రభావం కారణంగా మార్కెట్లను ప్రభావం అవుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం రేట్లు ఎంతంటే..?

కాగా శుక్రవారం బంగారం రేట్లు రూ.600 తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,950 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,200 వద్ద ట్రేడవుతోంది. గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,550గా ఉండగా.. 22 క్యారెట్ల ధ ధర రూ.1,40,750 వద్ద ఉన్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,820 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,000గా కొనసాగుతోంది. ఇక సిల్వర్ ధరలు కూడా తగ్గాయి. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది.