Reading Time: 2 minutes

రాజస్థాన్తో మ్యాచ్కి ముందు సన్‌రైజర్స్కు అదిరిపోయే న్యూస్.. కమిన్స్ ఎంట్రీకి లైన్ క్లియర్

Caption of Image.

Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరుతున్నట్లు ఎస్ఆర్హెచ్ స్వయంగా ప్రకటించాడు. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. రేపు (2026, ఏప్రల్ 25న) హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కమిన్స్ మైదానంలోకి దిగనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇప్పటికే గెలుపు జోష్‌లో ఉన్న ఎస్ఆర్‌హెచ్‌కు కమిన్స్ రాకతో బలం మరింత పెరగనుంది. 

ఈ సీజన్ ప్రారంభానికి ముందే ప్యాట్ కమిన్స్ వెన్ను నొప్పితో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. దీంతో జట్టు బాధ్యతలని యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ అందుకున్నాడు. తాత్కాలిక కెప్టెన్‌గా హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ ఇప్పుడు తిరిగి కోలుకుని ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన కమిన్స్ తిరిగి బరిలోకి రాబోతున్నాడు. ఎంతోకాలంగా ఈ సమయం కోసం వేచి చూస్తున్నాను.. రేపు మళ్లీ గ్రౌండ్ లోకి రావడం కోసం ఆసక్తిగా ఉన్నాను అంటూ ప్యాట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ లో వెల్లడించాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్స్ హ్యాండిల్ కూడా ‘వస్తున్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చి కమిన్స్ రాకను ధ్రువీకరించేసింది. 

►ALSO READ | చిన్నస్వామిలో సాయి సుదర్శన్ విధ్వంసం.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

ప్యాట్ కమిన్స్ దూరమైనప్పుడూ ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ దళం కొత్త ప్రయోగాలు చేసింది. యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ అరంగేట్రంలోనే అదరగొట్టారు. రాజస్థాన్ రాయల్స్‌పై చెరో 4 వికెట్లతో రెచ్చిపోయారు. ఇక హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి కమిన్స్ తీసుకుంటాడా? లేదా? అనే దానిపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ కిషన్ నాయకత్వంలో 7 మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. కానీ కమిన్స్ రాకతో విదేశీ ప్లేయర్స్ కాంబినేషన్‌లో మార్పులు జరిగే ఛాన్స్ కూడా ఉంది. కమిన్స్ స్థానంలో ఇప్పటి వరకు ఆడిన మదుశంక తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి సారథి రాకతో సన్‌రైజర్స్ బలంగా మారి టాప్ ప్లేస్ కోసం పోటీ పడే సూచనలు కనిపిస్తున్నాయి. 

 

©️ VIL Media Pvt Ltd.