Reading Time: < 1 minute

ISSF జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో శాంభవి–దివ్యాన్షుకు వరల్డ్‌‌‌‌ రికార్డు గోల్డ్‌‌‌‌

Caption of Image.

కైరో: ఇండియా షూటర్లు శాంభవి క్షీరసాగర్‌‌‌‌–దివ్యాన్షు దేవాంగన్‌ ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలిచారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఫైనల్లో శాంభవి–దివ్యాన్షు 499.9 పాయింట్లతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచారు. క్వాలిఫికేషన్‌‌‌‌ రౌండ్‌‌‌‌లోనూ వీళ్లిద్దరు 632.0 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. 

త్సాయ్‌‌‌‌ చిహ్‌‌‌‌ యింగ్‌‌‌‌–చెన్‌‌‌‌ యు అన్‌‌‌‌ (చైనీస్‌‌‌‌తైపీ, 498.3), టిఫెన్‌‌‌‌ పోమ్స్‌‌‌‌–గ్యాస్పర్డ్‌‌‌‌ లెస్యుయర్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌, 434.4) వరుసగా సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ను సాధించారు. 25 మీటర్ల ర్యాపిడ్‌‌‌‌ ఫైర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌ జూనియర్‌‌‌‌ విభాగం ఫైనల్స్‌‌‌‌లో సమీర్‌‌‌‌ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌‌‌‌గా ఇండియా 4 గోల్డ్‌‌‌‌, 5 సిల్వర్‌‌‌‌, 3 బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తో కలిపి12 పతకాలతో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కొనసాగుతోంది.
 

©️ VIL Media Pvt Ltd.