Reading Time: < 1 minute
Allu Arjun Atlee Film Update Aa22xa6 Title First Look And Glimpse Expected On April 8

Allu Arjun and Atlee Film Title Expected on April 8: ‘పుష్ప’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్.. వరుస బ్లాక్ బస్టర్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. #AA22 వర్కింగ్‌ టైటిల్‌. ఇప్పటికే షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండగా.. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ గురించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు అల్లు అభిమానులు.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టైటిల్‌, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. అంతకుమించి అనేలా సాలిడ్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. అంతేకాదు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం అట్లీ ఒక అదిరిపోయే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ ఎలాంటి లుక్‌లో కనిపించనున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. ఎందుకంటే ఇందులో ఆయన విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టుగా టాక్ ఉంది.

సాధారణంగా అట్లీ తన సినిమాల్లో హీరోలను అత్యంత స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా చూపిస్తుంటాడు. కాబట్టి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఫాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చిత్ర బృందం హింట్ ఇస్తోంది. దీంతో టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ఇంటర్నెట్ షేక్ అవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ.. 2027లో రిలీజ్ కానుంది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.