బంజారాహిల్స్ లోని ఆ ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్Caption of Image.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రగతి ప్రణాళికలో కేవలం పారిశుధ్యం మాత్రమే కాకుండా, పార్కుల అభివృద్ధి, చెరువుల శుభ్రత, రోడ్ల క్లీనింగ్, జంక్షన్ల సుందరీకరణ వంటి అంశాలపై అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అలతో కలిసి శనివారం ఆయన క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
బంజారాహిల్స్ లోని ఎన్బీటీ నగర్, అపోలో ఆసుపత్రి పరిసరాల్లోని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల (జీవీపీలు)ను పూర్తిగా తొలగించాలన్నారు. అనంతరం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించి, అక్కడ ప్రజలకు ఉపయోగపడేలా సుందరమైన పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు.