Reading Time: < 1 minute
Mohammad Amir Trolled India Vs England T20 Wc Semifinal Result

ICC T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, భారత్ సెమీస్‌లో గెలవదు, అసలు సెమీస్‌కే చేరదు అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అవాకులు చెవాకులు పెలాడు. భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు.

ప్రస్తుతం భారత్ ఫైనల్స్‌కు చేరడంతో మాట మార్చాడు. సోషల్ మీడియాలో అమీర్‌పై నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. టీమిండియాను ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్ చేరిన తర్వాత అమీర్‌ను ఆయన చేసిన కామెంట్స్ గురించి ఓ టీవీ ఛానెల్ యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అమీర్ మాట్లాడుతూ..‘‘ ఈ రోజు గుడ్ క్రికెట్ ఉంది, నేడు టీం ఇండియా పరిపూర్ణ క్రికెట్ ఆడింది. టీం ఇండియా గత మ్యాచ్‌లు చూస్తే ఇంగ్లాండ్ తో బాగా ఆడింది. ఇంగ్లాండ్ సంజూ శాంసన్ క్యాచ్ వదిలేసింది. అక్షర్ పటేల్ రెండు మంచి క్యాచ్‌లు పట్టుకున్నాడు. అక్షర్ క్యాచ్ పట్టకపోతే ఇంగ్లాండ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచేది’’ అని చెప్పాడు.

Read Also: Perni Nani : అప్పులపై అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు..! కాకి లెక్కలు, అబద్దపు కూతలు..

గతం సూపర్-8లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవదని, వెస్టిండీస్ సెమీస్ కు వెళ్తుందని ఆమీర్ అన్నారు. కానీ,అతడి అంచనాలు తప్పని తేలింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించి సెమస్‌కు చేరింది. సెమీస్‌లో ఇంగ్లాండ్ గెలుస్తుందని మళ్లీ ఓ జోస్యం చెప్పాడు. చివరకు భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌లో నిలిచింది. అమీర్ వ్యాఖ్యలు చేయడం, ఆయన వ్యాఖ్యలు తప్పని భారత్ నిరూపించడం జరుగుతూనే ఉంది. కానీ, గెలిచిన తర్వాత మాట మార్చడం చూస్తున్న భారత ఫ్యాన్స్ మాత్రం నీకన్నా ఊసరవెళ్లి నయం కదా అని అనుకుంటున్నారు.