
యంగ్ హీరో అల్లు శిరీష్, -నయనికల వివాహం ఈనెల 6న ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ కోకాపేట్‌లోని అల్లు స్టూడియోస్‌లో పెళ్లికి ముందు రిసెప్షన్ వేడుకను (ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్) వైభవంగా నిర్వహించారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులు అతిథులను ఆహ్వానించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సినీ స్టార్లు బాలకృష్ణ, నాగార్జున, రామ్‌చరణ్, రవితేజ, స్టార్ డైరెక్టర్లు సుకుమార్, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, అట్లీతో పాటు నవీన్ పొలిశెట్టి, మంచు లక్ష్మీ, ప్రియదర్శి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.