Reading Time: < 1 minute

 లంచం తీసుకుంటుండగా ఎస్‌పిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్‌ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మామిడిసెట్టి శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్‌గా టిజిఎస్‌పిడిసిఎల్, మాసబ్‌ట్యాంక్ సెక్షన్‌లో ఎఈ ఆపరేషన్‌గా పనిచేస్తున్నాడు. ఓ విద్యుత్ వినియోగదారుడి మీటర్‌ను సీజ్ చేయకుండా ఉండాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ఎఈని సంప్రదించడంతో రూ.16,000లు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు బాధితుడు ఎఈకి రూ.16,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఎఈని అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో ఎఈ శ్రీనివాస రావును హాజరుపర్చడంతో ఎసిబి స్పెషల్ జడ్జి రిమాండ్ విధించారు. దీంతో ఎఈని ఎసిబి అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.