Reading Time: 2 minutes
Us Iran Tension Uss Gerald R Ford Warship Toilet Sewage System Failure

US-Iran Tension: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏ క్షణానైనా ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధంగా అమెరికన్ సైన్యం ఉంది. ఇరాన్ సమీపంలో అరేబియా సముద్రంలో యూఎస్ విమానవాహక నౌక USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ తిష్ట వేసి ఉంది. ఇదే కాకుండా ఇరాన్ చుట్టు పక్కల అమెరికన్ బేసులు యాక్టివేట్ అయ్యాయి. భారీ సంఖ్యలో యూఎస్ ఫైటర్ జెట్లు మిడిల్ ఈస్ట్‌లో మోహరించారు.

ఇదిలా ఉంటే, అసలు యుద్ధానికి ముందే అమెరికన్ సైనికులను ‘‘టాయిలెట్ వార్’’ భయపెడుతోంది. ఇరాన్ వైపు కదులుతున్న USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ యుద్ధ నౌకలో టాయిలెట్లు మూసుకుపోయాయి. దీని వల్ల నౌకలో ఉన్న సైనికులు జీవితం దుర్భరంగా మారింది. 4500 మంది సైనికులు ప్రతీ రోజూ 45 నిమిషాల పాటు క్యూ లైన్లలో నిలుచోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నౌకలోని మురుగునీటి వ్యవస్థ విఫలమైంది. USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ జూన్ 2025 నుండి సముద్రంలో ఉంది. జనవరిలో, వెనిజులాపై అమెరికా దాడిలో ఈ నౌక కీలక పాత్ర పోషించింది, దీని ఫలితంగా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు, ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, యుద్ధనౌకను మధ్యప్రాచ్యానికి మోహరించారు.

Read Also: HPV vaccination: గర్భాశయ క్యాన్సర్లకు చెక్.. దేశవ్యాప్తంగా ఉచితంగా HPV వ్యాక్సినేషన్..

టాయిలెట్లు పనిచేయకపోవడం, ఓడలోని మురుగునీటి వ్యవస్థ పనిచేయకపోవడంతో పరిస్థితి దిగజారింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌకగా పరిగణించే ఈ యుద్ధ నౌకలో సౌకర్యాలు లేక సైనికులు ఇబ్బందిపడుతున్నారు. ఈ నౌకలో మొత్తం 650 టాయిలెట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు పనిచేయడం లేదు. సముద్రంలో నిరంతరం ఉండటంతో సరైన నిర్వహణ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ప్లంబింగ్, నావికుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. వ్యవస్థల్ని సరిచేయడానికి నిపుణులు రోజుకు 19 గంటలు పనిచేస్తున్నాయి. ఈ సమస్య గతేడాది మార్చిలో కూడా వచ్చింది. ఆ సమయంలో నాలుగు రోజుల పాటు 205 టాయిలెట్లు పనిచేయలేదు.

సాధారణంగా యుద్ధనౌకలో వాక్యూమ్ ఆధారిత మురుగునీటి వ్యవస్థ ఉంటుంది. ఒకే వాల్వ్ ఫెయిల్యూర్ మొత్తం కంపార్ట్‌మెంట్ లోని అన్ని టాయిలెట్లను దెబ్బతీస్తుంది. దీనికి తోడు కాల్షియం పేరుకుపోవడం వల్ల పైపులు మూసుకుపోతుంటాయి. ఈ వ్యవస్థల్ని సరిచేయడానికి ప్రతీసారి యాసిడ్ ఫ్లషింగ్ కోసం 4 లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది.