Reading Time: < 1 minute

లక్నో: చదువుకొమ్మని ఒత్తిడి తీసుకరావడంతో కన్నతండ్రిని కుమారుడు తుపాకీతో కాల్చి చంపి అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మన్వేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి వర్ధమాన్ పాథాలజీ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ప్రతాప్ సింగ్ కు అక్షత్ అనే కుమారుడు ఉన్నాడు. అక్షత్ పై గత కొన్ని రోజుల నుంచి చదువుకొమ్మని కన్నతండ్రి ఒత్తిడితీసుకొస్తున్నాడు. దీంతో చదువు విషయంలో తండ్రి, కుమారుడు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫిభ్రవరి 20న తెల్లవారుజామును కుమారుడిని చదువుకొమ్మని నిద్ర నుంచి లేపాడు. ఇద్దరు మద్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కోపంతో రగిలిపోయిన కుమారుడు తుపాకీ తీసుకొని తండ్రిని కాల్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేశాడు. ప్రతాప్ సింగ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుమారుడిపై అనుమానం ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.