Reading Time: < 1 minute

ఏఐ వాడకపోతే నో ప్రమోషన్‌.. సీనియర్ ఉద్యోగులకు యాక్సెంచర్ ఆర్డర్

Caption of Image.

న్యూఢిల్లీ: ఏఐ టూల్స్ వాడకపోతే  ప్రమోషన్స్ ఉండవని ఐటీ కంపెనీ యాక్సెంచర్‌‌ తన సీనియర్ ఉద్యోగులకు తేల్చి చేప్పింది.  ఇలాంటి విధానాలనే  మైక్రోసాఫ్ట్‌, మెటా, గూగుల్ కూడా  అమలు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల వర్క్ రివ్యూలో  ఏఐ వినియోగాన్ని తప్పనిసరి చేసింది. 

మెటా ఉద్యోగుల ఏఐ టూల్ వినియోగాన్ని ట్రాక్ చేస్తోంది. గూగుల్‌  ఏఐని వాడని ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ చేసింది. యాక్సెంచర్ తన ఏఐ ప్లాట్‌ఫామ్ ద్వారా ఉద్యోగుల ఏఐ వాడకాన్ని పర్యవేక్షించనుంది. యూరప్‌, యూఎస్‌ ప్రభుత్వ ఒప్పందాలపై పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.