Reading Time: < 1 minute

ఉద్యోగుల కు కొత్త హెల్త్ స్కీంపై రేపు (ఫిబ్రవరి 12 ) కీలక సమావేశం

Caption of Image.
  •     ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటుపైనే ప్రధాన చర్చ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకురాబోతున్న కొత్త ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) అమలుపై సర్కార్ స్పీడ్ పెంచింది. ఈ పథకం విధివిధానాలను ఖరారు చేసేందుకు, కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈ హెచ్​ఎస్​టీ )పై చర్చించేందుకు గురువారం సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు.

గతంలో జారీ చేసిన జీవో నెం.186 ఆధారంగా కొత్త హెల్త్ స్కీంను ఎలా అమలు చేయాలి? ట్రస్ట్ ఏర్పాటు ఎలా ఉండాలి? అనే అంశాలపై ఇందులో చర్చించి, ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నారు. ఈ మీటింగ్‌కు హోం శాఖ, సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, విద్యాశాఖ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ సీఈవో, డీఎంఈ (డీ ఎం ఈ)లు హాజరుకావాలని కోరారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేలా కొత్త స్కీంను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.

©️ VIL Media Pvt Ltd.